టీబీ కేసులపై డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ ఆరా

ABN , First Publish Date - 2023-05-25T23:38:37+05:30 IST

సంగారెడ్డిలోని క్షయ నివారణ విభాగాన్ని డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ డాక్టర్‌ స్నేహశుక్ల గురువారం తనిఖీ చేశారు.

టీబీ కేసులపై డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ ఆరా
టీబీ రోగుల రికార్డులు తనిఖీ చేస్తున్న డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ డాక్టర్‌ స్నేహశుక్ల

సంగారెడ్డి అర్బన్‌, మే 25: సంగారెడ్డిలోని క్షయ నివారణ విభాగాన్ని డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ డాక్టర్‌ స్నేహశుక్ల గురువారం తనిఖీ చేశారు. క్షయ రోగుల శాంపిళ్ల సేకరణ, నిర్ధారణ ఫలితాల వెల్లడి సమయం, రోగుల ట్రీట్‌మెంట్‌ ఫాలో అప్‌, అందిస్తున్న మందులు, ట్రీట్‌మెంట్‌ కార్డులు క్రాస్‌ వెరిఫికేషన్‌, టీబీ రోగులకు నెలకు అందించే పోషకాహార నగదు జమ తదితర రికార్డులను క్షుణంగా పరిశీలించారు. జిల్లాలోని ఎస్‌టీఎస్‌, ఎస్‌టీఎల్‌ఎ్‌సల వద్దనున్న క్షయ రోగుల సమాచారం, రికార్డులు తనిఖీ చేసి క్షయ రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అఽధికారి డాక్టర్‌ రాజేశ్వరి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-25T23:38:37+05:30 IST