పల్లవి ప్రశాంత్‌కు ఘనస్వాగతం
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:41 PM
బిగ్‌బాస్-7 రియాలిటీ షో విజేత పల్లవి ప్రశాంత్‌కు అభిమానులు, గజ్వేల్ యువకులు ఘనస్వాగతం పలికారు. సోమవారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చేరుకున్న ప్రశాంత్‌కు పూలమాలలతో స్వాగతం పలికారు.
గజ్వేల్, డిసెంబరు 18: బిగ్‌బాస్-7 రియాలిటీ షో విజేత పల్లవి ప్రశాంత్‌కు అభిమానులు, గజ్వేల్ యువకులు ఘనస్వాగతం పలికారు. సోమవారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చేరుకున్న ప్రశాంత్‌కు పూలమాలలతో స్వాగతం పలికారు. బిగ్‌బాస్ కప్ పట్టుకుని అభివాదం చేస్తూ గజ్వేల్ వరకు పల్లవి ప్రశాంత్ ర్యాలీగా వచ్చారు. పల్లవి ప్రశాంత్‌తో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున యువకులు తరలిరావడంతో గజ్వేల్‌లో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పల్లవి ప్రశాంత్ తన స్వగ్రామమైన గజ్వేల్ మండలం కొల్గూరుకు బయలుదేరి వెళ్లాడు. కాగా గజ్వేల్ బిడ్డ బిగ్‌బాస్ రియాలిటీ షోలో సెలబ్రిటీలను కాదని విజయం సాధించడం హర్షించదగిన విషయమని గజ్వేల్ ప్రజలు అభిప్రాయపడ్డారు. కొల్గూరులోని ప్రశాంత్ ఇంటి వద్ద సోషల్‌మీడియా, ఇతర రిపోర్టర్లు పెద్ద ఎత్తున హాడావిడి చేశారు. అటు స్వగ్రామమైన కొల్గూరులో ఇంటివద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, రెడ్‌కార్పేట్ వేసి అభిమానులు ప్రశాంత్‌కు స్వాగతం పలికారు.
శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు
బిగ్‌బాస్-7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎక్స్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మా సిద్దిపేటకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల పల్లెలో పొలం పనులు చేసుకునే వ్యక్తి బిగ్‌బా్‌సకు వెళ్లి విజేతగా నిలవడం, ప్రజల హృదయాలను గెలుచుకోవడం సంతోషకరమన్నారు. రైతు బిడ్డ సామాన్యుల ధృఢసంకల్పానికి నిదర్శంగా నిలిచారంటూ పల్లవి ప్రశాంత్ ఫోటోను ఎక్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.