మూడు రోజులుగా కేజీబీవీకి నీటిసరఫరా బంద్‌

ABN , First Publish Date - 2023-09-22T00:52:20+05:30 IST

దౌల్తాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

మూడు రోజులుగా కేజీబీవీకి నీటిసరఫరా బంద్‌
పంచాయతీ సరఫరా చేసిన నీటిని బకెట్లతో తీసుకెళ్తున్న విద్యార్థినులు

రాయపోల్‌, సెప్టెంబరు 21 : దౌల్తాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో నిత్యావసరాలకు నీటి సమస్య ఏర్పడింది. రెండు రోజుల నుంచి విద్యార్థులు స్నానాలు కూడా చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ సిబ్బంది గురువారం ట్యాంకర్‌తో విద్యాలయానికి నీటిని పంపించారు. దీంతో విద్యార్థులు ట్యాంకర్‌ నుంచి బకెట్ల ద్వారా నీటిని తీసుకెళ్లి వాడుకున్నారు. ఈ విషయమై నీటి సరఫరా అధికారి పవన్‌ను సంప్రదించగా సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

Updated Date - 2023-09-22T00:52:20+05:30 IST