వినాయక నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-09-22T00:14:31+05:30 IST
పాపన్నపేట/నారాయణఖేడ్, సెప్టెంబరు 21: వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిణి తెలిపారు. గురువారం పాపన్నపేట పోలీ్‌సస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.

మెదక్ జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిణి
పాపన్నపేట/నారాయణఖేడ్, సెప్టెంబరు 21: వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిణి తెలిపారు. గురువారం పాపన్నపేట పోలీ్‌సస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. వినాయక నిమజ్జనంరోజున వినాయక ప్రతిమలను చెరువు, కుంటల్లో నిమజ్జనం చేస్తున్న సందర్భంలో భక్తులు నీటిలోకి అధిక సంఖ్యలో వెళ్లవద్దని సూచించారు. ప్రధానంగా విద్యుత్‌దీపాల అలంకణ కోసం ఇనుప పైపులు వాడకుండా కర్రలు వినియోగించుకోవాలన్నారు. అనంతరం మెదక్, రామాయంపేట పోలీ్‌సస్టేషన్లకు కొత్తగా ఇద్దరు సీఐలు నియాకమైనట్లు ఆమె వివరించారు. ఈ సమావేశంలో మెదక్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. నారాయణఖేడ్ శివారులోని మనూరు మండలం కమలాపూర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనాల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్ల పనులను గురువారం ప్రారంభించారు. ఈ ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ రుబీనాబేగంనజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, శానిటేషన్ అధికారి శ్రీనివాస్, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు నగేష్, మాజీ ఎంపీటీసీ ముజామిల్ పరిశీలించారు.