నేటి నుంచి వేల్పుగొండ తుంబులేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలు

ABN , First Publish Date - 2023-02-01T22:32:34+05:30 IST

మండలంలోని వేల్పుగొండ శివారులోని చెరువు ఒడ్డున్న ఉన్న తుంబులేశ్వరస్వామి ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది.

 నేటి నుంచి వేల్పుగొండ తుంబులేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలు
వేల్పుగొండలోని తుంబులేశ్వర ఆలయం

టేక్మాల్‌, ఫిబ్రవరి 1: మండలంలోని వేల్పుగొండ శివారులోని చెరువు ఒడ్డున్న ఉన్న తుంబులేశ్వరస్వామి ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయ నిర్మాణం కాకతీయులనాటి ప్రసిద్ధ రామప్పగుడి శిల్ప సౌందర్యాన్ని తలపిస్తుందని ప్రజలు చెప్పుకుంటారు. వేల్పుగొండను దేవతల కొండ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇది జైనమత స్థావరంగా కూడా విలసిల్లింది. ఏటా 5 రోజుల పాటు తుంబులేశ్వరాలయం వద్ద జాతర నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌ నారాయణ, ఆలయ ధర్మకర్త రవికోటి రామశర్మ తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా రుద్రాభిషేకం ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు నంద దీపారాధన, పుణ్యాహవాచనం, కులశస్థాపన, బిల్వార్చన, షటోత్సవం, పాచి బండ్లు, ఉత్తర పూజ, పుష్పార్చన, బిల్వార్చన, పల్లకీసేవ, రథోత్సవం, పాదుకాపూజ, కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-02-01T22:32:35+05:30 IST