గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వర్గల్ విద్యాధరి క్షేత్రం
ABN , First Publish Date - 2023-06-14T00:36:25+05:30 IST
వర్గల్, జూన్ 13: రాష్ట్రంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వర్గల్ విద్యాధరి క్షేత్రం విరాజిల్లుతున్నదని, అటువంటి పుణ్యక్షేత్రం మన సిద్దిపేట జిల్లాలో ఉండటం ప్రజలు చేసుకున్న పుణ్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు
వర్గల్, జూన్ 13: రాష్ట్రంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వర్గల్ విద్యాధరి క్షేత్రం విరాజిల్లుతున్నదని, అటువంటి పుణ్యక్షేత్రం మన సిద్దిపేట జిల్లాలో ఉండటం ప్రజలు చేసుకున్న పుణ్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఆలయ వ్యవస్థాపకుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో జరుగుతున్న కంచి శంకర మఠం, శారదా వైదిక స్మార్త వేద విద్యాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ముందుగా క్షేత్రంలోని శ్రీశంకర మఠంలో ఉన్న కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం విద్యాధరి క్షేత్రంలోని విద్యా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యాధరి క్షేత్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. విద్యా సరస్వతీ అమ్మవారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మను ప్రార్థించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వేడుకల సందర్భంగా మూడోరోజు విద్యాధరి క్షేత్రంలో కంచి శంకర జయేంద్ర సరస్వతీ స్వామివారి శంకర మఠంలో చంద్రమౌళీశ్వర పూజలు నిర్వహించారు. వేడుకలకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు.
వేడుకలలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
వర్గల్ విద్యాధరి క్షేత్రంలో జరుగుతున్న శంకర మఠం ప్రారంభోత్సవాలలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, దేవీ ఉపాసకుడు దైవజ్ఞశర్మ, మర్పడగ సంతాన మల్లికార్జునస్వామి వ్యవస్థాపకులు హరినాథశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతా్‌పరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి పాల్గొన్నారు.