టీఎస్‌పీఎస్‌సీని వెంటనే ప్రక్షాళన చేయాలి: బీజేపీ

ABN , First Publish Date - 2023-03-18T23:44:50+05:30 IST

సిద్దిపేట క్రైం, మార్చి 18: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను వెంటనే ప్రక్షాళన చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఎ్‌సపీఎ్‌ససీ పరీక్షా పేపర్ల లీకేజీకి నిరసనగా శనివారం సిద్దిపేటలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

టీఎస్‌పీఎస్‌సీని వెంటనే ప్రక్షాళన చేయాలి: బీజేపీ
రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు

సిద్దిపేట క్రైం, మార్చి 18: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను వెంటనే ప్రక్షాళన చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఎ్‌సపీఎ్‌ససీ పరీక్షా పేపర్ల లీకేజీకి నిరసనగా శనివారం సిద్దిపేటలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీఎ్‌సపీఎ్‌ససీ పరీక్ష పేపర్ల లీకేజీకి కేటీఆర్‌ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 14 ఏళ్ల్ల నుంచి గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించలేదని, వేయక వేయక ఒక్క నోటిఫికేషన్‌ వేసి నాలుగు పరీక్షలు రద్దు చేస్తున్నానని చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రద్దు అయిన పరీక్షలకు హాజరైన నిరుద్యోగులకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2023-03-18T23:44:50+05:30 IST