సామర్థ్యాల పెంపునకు టీఎల్‌ఎం మేళా

ABN , First Publish Date - 2023-01-04T22:51:35+05:30 IST

డీఈవో నాంపల్లి రాజేశ్‌ పలు పాఠశాలల్లో టీఎల్‌ఎం మేళాలు

సామర్థ్యాల పెంపునకు టీఎల్‌ఎం మేళా
సంగారెడ్డిలో నిర్వహించిన మేళాలో విజేతలకు ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న డీఈవో రాజేశ్‌

సంగారెడ్డి అర్బన్‌/పటాన్‌చెరు/నారాయణఖేడ్‌/ జిన్నారం/కంది/పుల్‌కల్‌/కల్హేర్‌(సిర్గాపూర్‌)/తూప్రాన్‌/గుమ్మడిదల/కొండాపూర్‌: జనవరి 4: అభ్యసన సామర్థ్యాల పెంపునకు టీఎల్‌ఎం మేళాలు దోహదపడుతాయని సంగారెడ్డి డీఈవో నాంపల్లి రాజేశ్‌ పేర్కొన్నారు. సంగారెడ్డి మండల స్థాయి టీఎల్‌ఎం మేళాను స్థానిక గాంథీ సెంచనరీ హైస్కూల్‌లో బుధవారం నిర్వహించారు. డీఈవో రాజేశ్‌ హాజరై మాట్లాడుతూ.. తొలి మెట్టు కార్యక్రమంలో విద్యార్థులకు సులభతరంగా బోధించేందుకు ఈ మేళాలు ఉపకరిస్తాయన్నారు. ఉపాధ్యాయులు ప్రదర్శనగా తీసుకొచ్చిన టీఎల్‌ఎం స్టాల్స్‌ను సంగారెడ్డి ఎంఈవో వెంకట నర్సింలు, హెచ్‌ఎంలు పరిశీలించి అభినందించారు. అనంతరం విజేతలకు డీఈవో రాజేశ్‌ బహుమతులను ప్రదానం చేశారు. అలాగే పటాన్‌చెరు, నారాయణఖేడ్‌, జిన్నారం, కంది, పుల్‌కల్‌, కల్హేర్‌(సిర్గాపూర్‌), తూప్రాన్‌, గుమ్మడిదలలో టీఎల్‌ఎం మేళాలు నిర్వహించారు. కొండాపూర్‌లో ఇటీవల నిర్వహించిన మేళాలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఎంఈవో విజయలక్ష్మి మెమొంటోలను, ప్రశంసాపత్రాలను అందజేశారు.

Updated Date - 2023-01-04T22:51:37+05:30 IST