ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయాలి
ABN , First Publish Date - 2023-09-27T23:16:22+05:30 IST
డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
మెదక్, సెప్టెంబరు 27: ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను ప్రామాణికంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మెదక్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతానికి కృషి చేశామన్నారు. గ్రామాల్లో పార్టీని పటిష్టం చేశామని వివరించారు. ఎన్నికల వేళ రెడీమేడ్‌గా వచ్చి మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ తమకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారని వాపోయారు. పార్టీ అధిష్టానంపై పూర్తి నమ్మకం ఉన్నదని, పార్టీ కార్యకర్తలు, నాయకులు అధైర్యపడవద్దని తిరుపతిరెడ్డి సూచించారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల అంజనేయులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడూరి అంజనేయులు, నాయకులు అమీర్, పల్లె రాంచంద్రంగౌడ్, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే టికెట్ మహిళకే కేటాయించాలి: ఎంపీపీ
చిన్నశంకరంపేట: మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ మహిళకే ఇవ్వాలని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్‌రెడ్డి కోరారు. బుధవారం ఆమె చిన్నశంకరంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా ఎంపీపీగా భారీ మెజార్టీతో గెలిచిన ఘనత తమదేనన్నారు. కార్యకర్తలను కలుపుకొని పార్టీ కోసం నిరంతరం పనిచేశామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధిష్టానం ఆలోచనజేసి, ఈసారి మహిళను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. తనకు టికెట్ ఇస్లే భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
నర్సాపూర్‌లో గెలిచి, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం
నర్సాపూర్: నర్సాపూర్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నర్సాపూర్‌లోని ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన పలువురు వివిధ పార్టీల నుంచి కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందని అన్నారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలపై మంచి స్పందన వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ శివ్వంపేట మండలాధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హకీం, నాయకులు రియాజ్‌అలీ, ధన్‌సింగ్, అశోక్, రాము, మైసయ్య, గౌరయ్య, తిరుపతి, కృష్ణ, పూల్‌సింగ్, వెంకటేష్, అల్తాఫ్, సోఫీ, రాజు తదితరులు పాల్గొన్నారు.