ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర కీలకం
ABN , First Publish Date - 2023-05-25T22:56:37+05:30 IST
సిద్దిపేట అర్బన్, మే 25: ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా, సవ్యంగా కొనసాగాలంటే జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్ అన్నారు.

సిద్దిపేట అర్బన్, మే 25: ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా, సవ్యంగా కొనసాగాలంటే జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్ అన్నారు. గురువారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వార్త లాప్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన జర్నలిస్టుల అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. 40, 50 ఏళ్ల జర్నలిజంతో పోల్చుకుంటే నేడు ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. రానురాను ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు సోషల్ మీడియా వ్యవస్థ పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో జర్నలిస్టుల పాత్ర ఎలా ఉండాలి.. వార్తలు రాసే సందర్భంలో అంశాన్ని ఎలా తీసుకోవాలి.. నిజాయితీగా విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎలా రాయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ శృతిపాటిల్ తదితరులు పాల్గొన్నారు.