కంకర తేలిన రోడ్డుతో తండావాసుల ఇబ్బందులు

ABN , First Publish Date - 2023-03-18T23:47:05+05:30 IST

నిధులు మంజూరైనా మరమ్మతులు కరువు

కంకర తేలిన రోడ్డుతో తండావాసుల ఇబ్బందులు
కంకర తేలిన పిచేర్యగడి తండా రోడ్డు

కోహీర్‌, మార్చి 18: కోహీర్‌ మండలంలోని పిచేర్యగడి గ్రామ పంచాయతీ నుంచి పిచేర్యగడి తండా వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా కంకర తేలి అధ్వానంగా మారింది. ఈ రోడ్డు దెబ్బతిని సంవత్సరాలు గడుస్తున్నా మరమ్మతుకు అధికారులు చొరవ చూపడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తారు వేసి వదిలేయడంతో ప్రస్తుతం గుల్ల రాళ్లు పేర్చిన విధంగా తయారైంది. ఈ రోడ్డును బాగు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు తండావాసులు కోరినా ఏమాత్రం చలనం కనిపించడం లేదు. ఈ తండాలో దాదాపు 1,000 మంది గిరిజనులు ఉంటారు. వీరు మండల కేంద్రానికి వెళ్లాలన్నా, జహీరాబాద్‌ డివిజన్‌కు వెళ్లాలన్న ఈ రోడ్డే దిక్కు. కానీ కంకర తేలిన రోడ్డుపై వెళ్లాలంటే నిత్యం నరకయాతన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులైతే నిత్యం ఏదో చోట పడిపోయి గాయాల పాలవుతున్నారు. ఈ రోడ్డు దెబ్బతినడంతో ఆటోలు, ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లవు. ఏడాది క్రితం ఈ రోడ్డును బాగు చేసేందుకు ప్రభుత్వం రూ.1.42 కోట్ల నిధులను మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు అధికారులు టెండర్లు ఖరారు చేయకపోవడంతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభంకాలేదు.

Updated Date - 2023-03-18T23:47:05+05:30 IST