హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2023-01-02T23:12:30+05:30 IST
సిద్దిపేట అర్బన్, జనవరి 2: మద్దూరు మండల కేంద్రంలో ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టల్ వార్డెన్ రమణారెడ్డిని సస్పెండ్ చేయాలని కోరుతూ సోమవారం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు
సిద్దిపేట అర్బన్, జనవరి 2: మద్దూరు మండల కేంద్రంలో ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టల్ వార్డెన్ రమణారెడ్డిని సస్పెండ్ చేయాలని కోరుతూ సోమవారం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరవింద్, దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ మద్దూర్ ఎస్సీ వార్డెన్ రమణారెడ్డి గతంలో దుద్దెడలో ఉన్నప్పుడు విద్యార్థులను కొట్టి ‘మీకు ఎందుకురా హాస్టల్’ అని మూసేయించారని తెలిపారు. అలాగే మద్దూరు వచ్చి 30 మంది విద్యార్థులు ఉంటే 80 మంది విద్యార్థులు ఉన్నారని బిల్ చేసుకున్నారన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం కాకుండా నీళ్ల చారు, పురుగుల అన్నం పెట్టి దొంగ బిల్లులు పెట్టుకున్నాడని ఆరోపించారు. రమణారెడ్డిపైన విజిలెన్స్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండం సంజీవ్‌కుమార్, ఆముదాల రంజిత్‌రెడ్డి, జిల్లా సహాయక కార్యదర్శి కర్రల నవీన్ తదితరులు పాల్గొన్నారు.