కేంద్ర ప్రభుత్వానిది దురహంకారం

ABN , First Publish Date - 2023-03-26T00:00:12+05:30 IST

అధికారం ఉన్నదనే అహంకారంతో నరేంద్రమోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వానిది దురహంకారం
గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

రాహుల్‌పై అనర్హత వేటుతో కాంగ్రెస్‌ నాయకుల మండిపాటు

పలు మండలాల్లో మోదీ దిష్టిబొమ్మ దహనం

సిద్దిపేట టౌన్‌, మార్చి 25: అధికారం ఉన్నదనే అహంకారంతో నరేంద్రమోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్‌ సిద్దిపేట నాయకులు దరిపల్లి చంద్రం, బొమ్మల యాదగిరి, అత్తుఇమామ్‌ మండిపడ్డారు. నరేంద్రమోదీ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు శనివారం సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద మోదీ ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంలో పరస్పర వ్యాఖ్యలు సహజమేనన్నారు. మోదీని దొంగ అని వ్యాఖ్యానించినందుకు రాహుల్‌ గాంధీని ఎంపీ పదవి నుంచి సస్పెన్షన్‌ చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలిమొద్దీన్‌, మార్క సతీ్‌షగౌడ్‌, మహేందర్‌, గయాజుద్దీన్‌,రాకే్‌షయాదవ్‌, బింగి యాదిగిరి, అనిల్‌, మున్నా, సీతా బాలు, రఘుపతి మహారాజ్‌, అర్జున్‌, జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్‌ : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ సర్కార్‌ ది హిట్లర్‌ పాలనను తలపిస్తోందని టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ నాయిని యాదగిరి అన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తూంకుంట ఆంక్షారెడ్డి, పార్టీ మండలాఽధ్యక్షుడు మల్లారెడ్డి, సీనియర్‌ నాయకులు గుంటుకు శ్రీనివాస్‌, పట్టణాధ్యక్షుడు మోహన్నగారి రాజు, తదితరులు ఉన్నారు.

చిన్నకోడూరు: చిన్నకోడూరులోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు గణేష్‌, పీసీసీ భూ కమిటీ మాజీ మెంబర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి కనకరాజు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్జుయాదవ్‌, ఓబీసీ సెల్‌ మండలాధ్యక్షుడు చిరంజీవి, కిసాన్‌ సెల్‌ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, మండల కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

నంగునూరు: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం నంగునూరులో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తప్పెట శంకర్‌, ఎంపీటీసీ ఎనగందుల, నితిన్‌కుమార్‌, చెలికాని యాదగిరి, బాగు శ్రీకాంత్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

దుబ్బాక/మిరుదొడ్డి: దుబ్బాక పట్టణంలోని బస్టాండ్‌ వద్ద, అక్బర్‌పేట- భూంపల్లి మండల కేంద్రంలో శనివారం ప్రదాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాతూరి వెంకటస్వామిగౌడ్‌, ఆకుల రాములు, ర్యాకం రవీందర్‌, రాగుల శంకర్‌గౌడ్‌, జీడిపల్లి లింగం, సిద్ధుల ఎల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:00:12+05:30 IST