భాషాపండితులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి
ABN , First Publish Date - 2023-02-21T23:59:42+05:30 IST
ఉపాధ్యాయుల డిమాండ్, నిరసన
సంగారెడ్డి అర్బన్/మనూరు/కల్హేర్/నారాయణఖేడ్, ఫిబ్రవరి 21: నారాయణఖేడ్ మండలం అనంత సాగర్ జడ్పీహెచ్‌ఎ్‌సలో విధులు నిర్వహిస్తున్న భాషాపండితులు సి.హెచ్.దేవదానం, కె.లక్ష్మణ్ రాథోడ్‌లపై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలకు పిలుపునిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, రవికుమార్, ప్రశాంతి, రాజు పాల్గొన్నారు. మనూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు యాదగిరి, చంద్రకాంత్, లక్ష్మణ్, మల్లికార్జున్, రాజు, శివలింగం, శివశేఖర్, పాల్గొన్నారు. కల్హేర్, నిజాంపేట మండలాల్లోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కల్హేర్, క్రిష్ణాపూర్ ఉన్నత పాఠశాలలతో పాటు నిజాంపేట మండలంలోని మునిగేపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. వారిలో కల్హేర్ ఉమ్మడి మండల పీఆర్టీయూ అధ్యక్షుడు మాలోత్ మోహన్, టీఎ్‌సయూటిఎఫ్ అధ్యక్షుడు శ్రీరాం ఉన్నారు. నారాయణఖేడ్ ప్రాంతంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.