Share News

పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:10 PM

హుగ్గెల్లిలో మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం

పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హుగ్గెల్లి గ్రామంలో మల్లన్న ఆలయంలో కల్యాణమహోత్సవం

జహీరాబాద్‌/రేగోడు/కల్హేర్‌/నర్సాపూర్‌, డిసెంబరు 31: మండల పరిధిలోని హుగ్గెల్లి గ్రామంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఆలయ ఆవరణలో స్వామివారి కల్యాణ మహోత్సవం ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. గొల్లబీర్ల కళాకారుల ఆట,పాటలతో మార్మోగింది. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు హుగ్గెల్లి రాములు, గ్రామసర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ రాములు, మాజీ సర్పంచ్‌ కిషన్‌ పాల్గొన్నారు. మల్లికార్జునస్వామి కల్యాణోత్సవంలో మాజీమంత్రి చంద్రశేఖర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనవెంట కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి ఉన్నారు.

కొత్వాన్‌పల్లిలో మల్లికార్జునస్వామి కల్యాణం

రేగోడు మండలంలోని కొత్వాన్‌పల్లి గ్రామంలో ఆదివారం మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయం వద్ద అగ్నిగుండం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి మల్లికార్జున స్వామి ఆలయానికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజు పాల్గొన్నారు.

దేవునిపల్లి మల్లన్నగుట్ట జాతర

కల్హేర్‌ మండల పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో దేవునిగుట్టపై వెలసిన మల్లన్నస్వామి ఆలయ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు యాదవ సంఘం సభ్యులు, నాయకులు స్వాగతం పలికారు. ఉత్సవాల్లో వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ దిలీ్‌పకుమార్‌, దేవునిపల్లి సర్పంచ్‌ సులోచనభూపాల్‌, మాసాన్‌పల్లి మాజీ సర్పంచులు గోపాల్‌, మోహన్‌రెడ్డి, కిష్టాగౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు యాదవరెడ్డి, తుకారాం, సంగమేశ్వర్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు అనిల్‌గుప్తా, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

నర్సాపూర్‌లో యాదవసంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లికార్జునస్వామి ఆలయ ఉత్సవాలు ఆదివారం రెండోరోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతపూజ, గంగకు వెళ్లడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Dec 31 , 2023 | 11:10 PM