టీఎస్‌పీఎస్సీలో సత్తా చాటిన రేణుక
ABN , First Publish Date - 2023-09-22T00:50:27+05:30 IST
మండలంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ టీఎ్‌సపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఉమెన్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించింది.

రాష్ట్రస్థాయి మహిళా కేటగిరిలో నాలుగో ర్యాంక్
నంగునూరు,సెప్టెంబరు 21: మండలంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ టీఎ్‌సపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఉమెన్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన బట్ట రేణుక పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి, 2010లో ఎస్సెస్సీలో 555 మార్కులు సాధించింది. బాసర ట్రిపుల్ ఐటీలో 2016లో మెకానిక్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసింది. ఉస్మానియా క్యాంప్‌సలో ఎంటెక్ చదివి, పీహెచ్‌డీ చేస్తున్న క్రమంలో టీఎ్‌సపీఎస్సీ పరీక్ష రాసింది. బుధవారం రాత్రి విడుదలైన టీఎ్‌సపీఎస్సీ ఫలితాల్లో అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్‌గా స్టేట్ ఓపెన్ కేటగిరిలో 94వ ర్యాంక్, రాష్టస్థాయి ఉమెన్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. మొదటి నుంచి కేజీ టు పీహెచ్‌డీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివి ఎలాంటి కోచింగ్‌లకు వెళ్లకుండా మంచి ర్యాంకు సాధించిన రేణుకను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అభినందించారు.