టోల్‌’ భారం తగ్గింపు

ABN , First Publish Date - 2023-03-31T00:30:05+05:30 IST

భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) హైవేలపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో 2023-24 సంవత్సరానికి గాను టోల్‌ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.

టోల్‌’ భారం తగ్గింపు

నేటి అర్ధరాత్రి నుంచిఅమలు

వాహనదారులకు కాస్త ఊరట

తూప్రాన్‌, మార్చి 30: భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) హైవేలపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో 2023-24 సంవత్సరానికి గాను టోల్‌ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. యేటా 5 నుంచి 10శాతం వరకు టోల్‌ రుసుం పెంచుతూ నిర్ణయం తీసుకునేవారు. ఈ సారి మాత్రం 5 నుంచి 6.50శాతం వరకు ధరలను తగ్గించారు. అయితే స్థానిక వాహనాల నెలవారి అద్దె రుసుం మాత్రం పెంచారు. ఈనెల 27న ఎన్‌హెచ్‌ఏఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (టెక్నికల్‌) జీవీ భీమాసేనారెడ్డి ఆదేశాలు జారీ చేయగా ఈనెల 31 అర్ధరాత్రి (ఏప్రిల్‌ 1) నుంచి అమల్లోకి రానున్నాయి. కాశ్మిర్‌ నుంచి కన్యాకుమారిని కలిపే హైవే 44పై మెదక్‌ జిల్లా అల్లాపూర్‌శివారులో 2009 ఏప్రిల్‌ 20న టోల్‌ప్లాజాను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-03-31T00:30:05+05:30 IST