కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు
ABN , First Publish Date - 2023-10-30T00:11:30+05:30 IST
పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
మంత్రి హరీశ్‌రావు
కొండపాక, అక్టోబరు 29 : పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొండపాక మండలంలోని పలువురు కార్యకర్తలు, నాయకులు కొద్దిరోజుల నుంచి అసమ్మతితో ఉండడంతో వారిని మంత్రి హైదరాబాద్‌కు పిలిపించుకొని మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న తమకు గుర్తింపు లేకుండాపోయిందని మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఇటీవల దుద్దెడలో సమావేశం నిర్వహించారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో మంత్రి ఆదివారం వారితో మాట్లాడి పార్టీ కోసం కష్టపడే వారిని ఎప్పుడూ మరిచిపోదని వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను తన దృష్టికి తేవాలని మంత్రి కోరారు. కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు.