డీఎస్పీగా రమే్‌షకుమార్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2023-07-20T00:22:47+05:30 IST

సంగారెడ్డి డీఎస్పీగా జూపల్లి రమే్‌షకుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

డీఎస్పీగా రమే్‌షకుమార్‌ బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి క్రైం, జూలై 19: సంగారెడ్డి డీఎస్పీగా జూపల్లి రమే్‌షకుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు అధికారుల బదిలీల్లో భాగంగా ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రవీంద్రారెడ్డిని హైదరాబాద్‌ చీఫ్‌ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న రమే్‌షకుమార్‌ను సంగారెడ్డి డీఎస్పీగా బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చే శారు. నూతన డీఎస్పీకి పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డి, రూరల్‌ సీఐ సుధీర్‌కుమార్‌లతో పాటు ఎస్‌ఐలు, పోలీసులు ఘన స్వాగతం పలికారు.

Updated Date - 2023-07-20T00:22:47+05:30 IST