బీజేపీతోనే దేశాభివృద్ధి

ABN , First Publish Date - 2023-09-22T23:34:04+05:30 IST

జహీరాబాద్‌, సెప్టెంబరు 22: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ డీసీసీబీ చైర్మన్‌ జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

బీజేపీతోనే దేశాభివృద్ధి
పలువురికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జైపాల్‌ రెడ్డి, తదితరులు

మాజీ డీసీసీబీ చైర్మన్‌ జైపాల్‌రెడ్డి

జహీరాబాద్‌, సెప్టెంబరు 22: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ డీసీసీబీ చైర్మన్‌ జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జహీరాబాద్‌ పట్టణంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమాశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు రాంచెందర్‌ రాజనర్సింహ, జిల్లా అధికార ప్రతినిధి సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ జహీరాబాద్‌ ప్రాంతంలో బీజేపీ బలోపేతానికి అందరం సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ఇదిలా ఉండగా కాశీంపూర్‌ గ్రామానికి చెందిన వివిధపార్టీల నాయకులు రవి, లింగప్ప, వంశీ, అంజప్ప, సిద్ధు, దశరత్‌, సదానంద్‌, రవీందర్‌, మారుతీ, దిలీప్‌, వెంకట్‌ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, న్యాయవాది బుచ్చిరెడ్డి, నాయకులు మోహన్‌, తుక్కరాం పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:34:04+05:30 IST