రేవంత్‌రెడ్డి, మాణిక్‌థాక్రేను కలిసిన నర్సారెడ్డి

ABN , First Publish Date - 2023-06-26T00:19:43+05:30 IST

గజ్వేల్‌, జూన్‌ 25: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌థాక్రే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

రేవంత్‌రెడ్డి, మాణిక్‌థాక్రేను కలిసిన నర్సారెడ్డి
టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో నర్సారెడ్డి

గజ్వేల్‌, జూన్‌ 25: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌థాక్రే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గజ్వేల్‌, సిద్దిపేటకు చెందిన నాయకులతో కలిసి, పార్టీ అభివృద్ధి, చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. వారితో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, గజ్వేల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రమోద్‌కుమార్‌, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాయిని యాదగిరి, సీనియర్‌ నాయకులు కేశిరెడ్డి రవిందర్‌రెడ్డి, ఫాక్స్‌ మాజీ చైర్మన్‌ వంటేరు నరేందర్‌రెడ్డి, శ్రీధర్‌ ఉన్నారు. అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌థాక్రేను టీపీసీసీ డెలిగేట్‌ సభ్యుడు మాదాడి జశ్వంత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో కాంగ్రెస్‌ నాయకులు నెంటూరు కుమార్‌, బూర్గుపల్లి కృష్ణారెడ్డి, మహ్మద్‌ అజ్గర్‌, యాదగిరి ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:19:43+05:30 IST