మండలస్థాయి అధికారులు సమావేశాలకు హాజరుకావాలి

ABN , First Publish Date - 2023-09-22T23:37:25+05:30 IST

తూప్రాన్‌/హవేళిఘణపూర్‌, సెప్టెంబరు 22: మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాలకు మండలస్థాయి అధికారులు విధిగా హాజరుకావాలని ఎంపీపీ గడ్డి స్వప్నావెంకటేశ్‌యాదవ్‌, ఎంపీడీవో ఆరుంధతి పేర్కొన్నారు.

మండలస్థాయి అధికారులు సమావేశాలకు హాజరుకావాలి
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎంపీపీ స్వప్న

తూప్రాన్‌/హవేళిఘణపూర్‌, సెప్టెంబరు 22: మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాలకు మండలస్థాయి అధికారులు విధిగా హాజరుకావాలని ఎంపీపీ గడ్డి స్వప్నావెంకటేశ్‌యాదవ్‌, ఎంపీడీవో ఆరుంధతి పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీ అధ్యక్షతన మండల సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 5వేల ఎకరాల్లో ఆయిల్‌పాం పంటలు సాగుచేసేందుకు నిర్ణయించినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సయ్య పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్‌ఫాం తోటలు సాగు చేపట్టంతో లక్షమందికి ఉపాధి లభించనున్నట్లు నర్సయ్య వివరించారు. తూప్రాన్‌ మండలంలో వానాకాలం పంటల సాగు 2 వేల ఎకరాల్లో జరిగిందని వ్యవసాయ అధికారి గంగుమల్లు పేర్కొన్నారు. యావాపూర్‌ గ్రామంలో రెండు సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కావాలని సర్పంచ్‌ శేరి నర్సింహారెడ్డి కోరారు. మండల అధికారులు సమస్యల పష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం మండల మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ ఏఈ వాడి గ్రామంలో త్రీఫేస్‌ లైన్‌ ఏర్పాడు చేయడం లేదని సర్పంచ్‌ యమిరెడ్డి తెలిపారు. విద్యుత్‌ అధికారులు అత్యుత్సాహంతో నాగాపూర్‌ గ్రామంలో 150 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారని, వెంటనే ఈ కేసులను తీసేయాలని సర్పంచ్‌ రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వైస్‌ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్‌, తహసీల్దార్‌ నారాయణ, ఎంపీడీవో శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:37:25+05:30 IST