వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2023-03-18T23:34:24+05:30 IST

సిద్దిపేట అర్బన్‌, మార్చి 18: సిద్దిపేట మండలం కార్యాలయంలో శనివారం జరిగిన అర్బన్‌ మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది.

వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం
సమస్యలపై నిలదీస్తున్న సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కమలాకర్‌రావు

గృహ నిర్మాణాలపై చర్చ

సిద్దిపేట అర్బన్‌, మార్చి 18: సిద్దిపేట మండలం కార్యాలయంలో శనివారం జరిగిన అర్బన్‌ మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు సైతం పరిష్కరించకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ టీఎస్‌ బీపాస్‌ ద్వారా కాకుండా మీసేవ ద్వారా సేవలందించాలని కోరారు. టీఎ్‌సబీ పాస్‌తో ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుందని, అదే మీసేవ ద్వారా తక్కువ ఖర్చు అవుతుందని గుర్తుచేశారు. గ్రామాల్లో నివసించే ప్రజలు గృహ నిర్మాణాల అనుమతి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామపంచాయతీలకు రాష్ట్ర ఫైనాన్స్‌, సెంట్రల్‌ ఫైనాన్స్‌ నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గ్రామపంచాయతీ సఫాయి వర్కర్లకు మూడునెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో విధుల్లోకి రాలేకపోతున్నారని వాపోయారు. అంతేకాకుండా కొన్నిరోజుల నుంచి లైన్‌మాన్ల కొరత వల్ల మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ఇబ్బంది ఉన్నదన్నారు. అనంతరం ఎంపీపీ సవితాప్రవీణ్‌రెడ్డి, ఎంపీడీవో సమ్మిరెడ్డి సభ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కమలాకర్‌రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:34:24+05:30 IST