మనఊరు-మనబడి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-01-17T23:24:15+05:30 IST

సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌

మనఊరు-మనబడి పనులను త్వరగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డి అర్బన్‌, జనవరి 17: జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మన ఊరు-మన బడి పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇంజనీరింగ్‌ ఈఈ, డీఈలపై కలెక్టర్‌ శరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనుల్లో జాప్యం చేయకుండా పనులను నాణ్యతతో చేపడుతూ సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయిన పాఠశాలలకు పెయింటింగ్‌ పూర్తికావాలన్నారు. ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ఉండేలా చొరవ చూపాలని ఎంఈవోలకు సూచించారు. పూర్తయిన పనులకు వెంటనే ఎఫ్‌టిఓలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అన్ని హంగులతో మోడల్‌ స్కూల్స్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, డీఈవో రాజేశ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T23:24:17+05:30 IST