మల్లన్న హుండీ ఆదాయం 59రోజులు..రూ.1.05కోట్లు

ABN , First Publish Date - 2023-05-25T23:41:46+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం ఈవో బాలాజీశర్మ ఆధ్వర్యంలో కానుకలు, ఒడిబియ్యం హుండీలను లెక్కించారు.

మల్లన్న హుండీ ఆదాయం 59రోజులు..రూ.1.05కోట్లు
కానుకలను లెక్కిస్తున్న మహిళాసేవసమితి సభ్యులు

చేర్యాల, మే 25 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం ఈవో బాలాజీశర్మ ఆధ్వర్యంలో కానుకలు, ఒడిబియ్యం హుండీలను లెక్కించారు. ఈ సందర్భంగా రూ.1,05,83,558నగదు, 68గ్రాముల బంగారం, 11.100కిలోల వెండి మిశ్రమం, 1800కిలోల ఒడిబియ్యం, 27 విదేశీ కరెన్సీనోట్లు లభ్యమయ్యాయి. మల్లన్న భక్తులు నిత్యం అధికసంఖ్యలో మొక్కులు తీర్చుకోవడంతో 59 రోజులలో ఈ ఆదాయం సమకూరిందని ఈవో బాలాజీశర ్మ తెలిపారు. మల్లన్న ఆలయాన్ని ప్లాస్టిక్‌ ఫ్రీగా చేయాలన్న నిర్ణయం మేరకు ప్రసాదాలను ప్లాస్టిక్‌ రహిత కవర్లలో అందించడాన్ని గురువారం సాయంత్రం ఈవో బాలాజీశర్మ, చైర్మన్‌ గీస భిక్షపతి ప్రారంభించారు. ఇక నుంచి పులిహోర, లడ్డూ, సిరా ప్రసాదాలను అందజేస్తామని, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించినట్లు వివరించారు.

Updated Date - 2023-05-25T23:41:46+05:30 IST