హరీశ్‌రావుకు మైనంపల్లి క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2023-08-22T23:36:39+05:30 IST

బీఆర్‌ఎస్‌ నాయకుల డిమాండ్‌ మైనంపల్లి దిష్టిబొమ్మల దహనం

హరీశ్‌రావుకు మైనంపల్లి క్షమాపణ చెప్పాలి
చేర్యాలలో మైనంపల్లి హన్మంతరావు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

సిద్దిపేట టౌన్‌/సిద్దిపేటరూరల్‌/చేర్యాల/హుస్నాబాద్‌ రూరల్‌/చిన్నకోడూరు/కొండపాక/కోహెడ/మద్దూరు, ఆగస్టు 22: మంత్రి హరీశ్‌రావుపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచితవ్యాఖ్యలు చేయడం తగదని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హరీశ్‌రావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు పట్టణాల్లో మైనంపల్లి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారే వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అని మండిపడ్డారు. తన కుమారుడికి టికెట్‌ రాలేదనే అక్కసుతో మంత్రి హరీశ్‌రావుపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి హరీశ్‌రావు గురించి మాట్లాడే హక్కు మైనంపల్లి హనుమంతరావు లేదన్నారు. సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్‌ మండలంలోని ప్రజాప్రతినిధులు స్థానిక ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోటగిరి శ్రీహరిగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎర్ర యాదయ్య పాల్గొన్నారు. మైనంపల్లి హనుమంతరావును బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని కొమురవెళ్లి ఆలయ సభ్యుడు మరుపల్లి శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మోడల్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిరాహా దీక్ష చేశారు. చేర్యాల మండలకేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, పార్టీ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి, నాయకులు కోతి దాసు, ముస్త్యాల కిష్టయ్య, గోనె హరి, ముస్త్యాల నాగేశ్వర్‌రావు, నాజర్‌, సిద్దిరాములు, పెంబర్ల రాజశేఖర్‌, యాట భిక్షపతి, అరిగె కనకయ్య, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్‌, మంగోలు చంటి, పచ్చిమడ్ల సతీశ్‌ పాల్గొన్నారు. కొమురవెల్లిలో మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప, పార్టీ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, వైస్‌ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, తలారి కిషన్‌, సర్పంచులు భీమనపల్లి కరుణాకర్‌, పచ్చిమడ్ల స్వామి, బొంగు తిరుపతిరెడ్డి, బొడ్గం వంశీ, కానుగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలంలోని చిన్నకోడూరు, చౌడారం గ్రామాల్లో దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు ఉమేష్‌ చంద్ర, వైస్‌ ఎంపీపీ పాపయ్య, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పీఏసీఏస్‌ చైర్మన్‌ కనకరాజు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. నిత్యం ప్రజల కోసం పని చేసే వ్యక్తి మంత్రి హరీశ్‌రావుపై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కొండం వనిత అన్నారు. హుస్నాబాద్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, ఎంపీపీ లకావత్‌ మానస, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్‌పాష, మండలాధ్యక్షుడు వంట వెంకట్రామిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, శోక్‌బాబు, తిరుపతిరెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు ఎండి ఆయూబ్‌, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. కొండపాకలో ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కోల సద్గుణ మంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కోహెడలో మైనంపల్లి దిష్టిబొమ్మను రాష్ట్రకార్యదర్శి కర్ర శ్రీహరి, మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్‌, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, నాయకులు కర్ర రవీందర్‌, మాజీ జడ్పిటీసీ లక్ష్మణ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ఖదీర్‌, నాగరాజు, రహీం, రాజమౌళి, శ్రీకాంత్‌ దహనం చేశారు. మద్దూరు, దూళిమిట్ట మండల కేంద్రాల్లో మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలతమల్లేశం, పార్టీ మండలాధ్యక్షుడు మేక సంతోష్‌, మంద యాదగిరి, మహిళా అధ్యక్షురాలు కర్ర అరుణ, వజ్రోజు శంకరాచారీ, నాయకులు సుందరగిరి పరశురాములు, బొల్లు చంద్రమౌళి, దామెరమల్లేశం, వేణుగోపాల్‌రెడ్డి, చొప్పరి సాగర్‌, నాచగోని వెంకట్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:36:39+05:30 IST