సీపీఐకి పునర్‌వైభవం తీసుకొద్దాం: చాడ వెంకటరెడ్డి
ABN , First Publish Date - 2023-06-26T00:21:28+05:30 IST
హుస్నాబాద్, జూన్ 25: హుస్నాబాద్‌లో సీపీఐకి పునర్ వైభవాన్ని తీసుకొస్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.
హుస్నాబాద్, జూన్ 25: హుస్నాబాద్‌లో సీపీఐకి పునర్ వైభవాన్ని తీసుకొస్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐకి కంచుకోటగా ఉండే హుస్నాబాద్‌లో గతంలో మాదిరిగా పార్టీని పటిష్టం చేసి వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎర్ర జెండాను ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు నిరంతం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డిల అమరుల భవనంలో జరిగిన హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేశాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసి ప్రశ్నించే వారిని దేశ ద్రోహం పేరుతో అరె్‌స్టలు చేస్తున్నదని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత పేదలపై అనేక రకాలుగా ఆర్థికభారం మోపుతూ పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. గృహలక్ష్మి పథకం కింద ఇస్తున్న రూ.3 లక్షలను రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు జాగీర్ సత్యనారాయణగౌడ్, సృజన్‌కుమార్, వనేష్, భాస్కర్, ప్రతా్‌పరెడ్డి, పద్మ, జనార్ధన్, మధు, స్వాతి పాల్గొన్నారు.