కేసీఆర్ అంటే నమ్మకం.. విశ్వాసం
ABN , First Publish Date - 2023-10-30T00:08:51+05:30 IST
కేసీఆర్ అంటే నమ్మకం.. విశ్వాసం అని.. చావు నోట్లో తెలపెట్టి తెలంగాణ తెచ్చిన ఆయన రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
మోసం చేసే కాంగ్రెస్ కావాలా? ప్రజల కోసం తపించే కేసీఆర్ కావాలో తేల్చుకోండి : మంత్రి హరీశ్‌రావు
నర్సాపూర్, అక్టోబరు 29: కేసీఆర్ అంటే నమ్మకం.. విశ్వాసం అని.. చావు నోట్లో తెలపెట్టి తెలంగాణ తెచ్చిన ఆయన రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంక్షేమంలో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ పాలన కావాలో.. మోసపూరిత మాటలతో మాయచేసే కాంగ్రెస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి, లేబర్‌వెల్ఫేర్‌బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తండాలు, పల్లెలు అభివృద్ధికి నోచుకున్నాయని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 11 సార్లు కాంగ్రె్‌సకు అవకాశమిస్తే అభివృద్ధి చేయకుండా.. ఇప్పుడు మరోసారి అవకాశం కావాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలో అందరికీ మేలుచేసే హామీలు ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మదన్‌రెడ్డిని ఎంపీగా గెలిపిస్తా
నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతారెడ్డిని గెలిపించే బాధ్యతను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిపై, కార్యకర్తలపై ఉంచారిని... మూడునెలల్లో మదన్‌రెడ్డిని ఎంపీగా గెలిపించే బాధ్యతను తనపై ఉంచారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం బీఆర్‌ఎ్‌సలో ఎటువంటి వర్గాలు లేవని.. అందరూ కేసీఆర్ వర్గమేనని సునీతారెడ్డి పేర్కొన్నారు. మదన్‌రెడ్డితో పాటు నాయకులంతా తనకు మద్దతుగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. అందరికి న్యాయం చేస్తానన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ సునీతారెడ్డిని గెలిపించడానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యకర్తలంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు శేఖర్, శ్రీనివా్‌సరెడ్డి, గౌరీశంకర్, రామాగౌడ్, జడ్పీటీసీలు మహే్‌షగుప్తా, ఆంజనేయులు, బబియానాయక్, రమే్‌షగౌడ్, ఎంపీపీలు హరికృష్ణ, మంజుల, నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్లు రాజుయాదవ్, వెంకట్రామ్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు దామోదర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, సంతో్‌షరెడ్డి, సత్యంగౌడ్, మహ్మద్, సురారం నర్సింహులు, హుస్సేన్, తొంట వెంకట్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.