రేషన్‌ దుకాణాలలో విజిలెన్స్‌ కమిటీ సభ్యుల తనిఖీలు

ABN , First Publish Date - 2023-07-21T00:27:07+05:30 IST

జిల్లాలోని తూప్రాన్‌, మెదక్‌ పట్టణంలోని పలు రేషన్‌ దుకాణాల్లో గురువారం విజిలెన్స్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఉపెందర్‌, జీఎల్‌ శర్మ తనిఖీలను నిర్వహించారు.

రేషన్‌ దుకాణాలలో విజిలెన్స్‌ కమిటీ సభ్యుల తనిఖీలు
రేషన్‌ దుకాణాల్లో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ కమిటీ సభ్యులు

మెదక్‌, జూలై 20: జిల్లాలోని తూప్రాన్‌, మెదక్‌ పట్టణంలోని పలు రేషన్‌ దుకాణాల్లో గురువారం విజిలెన్స్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఉపెందర్‌, జీఎల్‌ శర్మ తనిఖీలను నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాజర్షిషా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్‌ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలతో పాటు పాఠశాలల్లో బియ్యం నాణ్యతను, ఇబ్బందులను కేంద్ర విజిలెన్స్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఉపెందర్‌, జీఎల్‌ శర్మను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ షాపుల్లో సమయపాలన పాటించాలని, కీ రిజిష్టర్‌ తప్పకుండా అమలు చేయాలని డీలర్లకు సూచించినట్టు వివరించారు. అదేవిధంగా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని, పోర్టిఫైడ్‌ రైస్‌ ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలని డీలర్లకు చెప్పామన్నారు. అనంతరం విజిలెన్స్‌ కమిటీ సభ్యులు మెదక్‌లోని ఎంఎల్‌ఎస్‌ గోదాంను సందర్శించి బియ్యం నాణ్యతను పరిశీలించారు. సమావేశంలో డీఎ్‌సవో శ్రీనివాస్‌, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి విజయలక్ష్మి, జిల్లా మెట్రాలజీ అధికారి, రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:27:07+05:30 IST