గ్రామాల అభివృద్ధికి పరిశ్రమలు సహకరించాలి
ABN , First Publish Date - 2023-05-25T23:05:38+05:30 IST
నర్సాపూర్ ఎమ్మెలే మదన్‌రెడ్డి

హత్నూర, మే 25: గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల యాజమాన్యాలు తోడ్పాటును అందించాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరారు. హత్నూర మండలంలోని గుండ్లమాచునూర్ గ్రామ శివారులో గల హానర్ ల్యాబ్ యూనిట్-5 పరిశ్రమ యాజమాన్యం ప్రత్యేక నిధులతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాలను హత్నూర ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో నెలకొల్పిన పరిశ్రమల యాజమాన్యాలు సీఎ్‌సఆర్ నిధులతో పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిరిపురం, సికింద్లాపూర్ గ్రామాలకు వైకుంఠ రథాలు అందజేసిన హానర్ ల్యాబ్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ వావిలాల నర్సింలు, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపీడీవో శారదాదేవి, ఎంపీవో సువర్ణ, పరిశ్రమ ప్రతినిధి సుభా్‌షరెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, యువత అధ్యక్షుడు కిషోర్, సర్పంచ్ వీరస్వామిగౌడ్, మాణిక్యరెడ్డి, మచ్చ నరేందర్, యాదగిరి, విఠల్‌రెడ్డి, బేగరి రాజు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డు ఉద్యోగుల కోసం ప్రత్యేక భవనం
నర్సాపూర్: రిటైర్డు ఉద్యోగులు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో ప్రత్యేకంగా భవనం నిర్మించడానికి రెండుగుంటల స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో కేటాయించిన రెండు గుంటల స్థలంలో రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరి సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నది కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. రిటైర్డు ఉద్యోగులకు అన్ని విధాల తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. భవన నిర్మాణం కోసం తనవంతు రూ.ఐదులక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బబియానాయక్, ఎంపీపీ ఉపాఽధ్యక్షుడు నర్సింగ్‌రావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ నయీమొద్దీన్, పార్టీ మండలాధ్యక్షుడు శేఖర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, తహసీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ వెంకట్‌గోపాల్ పాల్గొన్నారు.