ఐకేపీ వీవోఏల సమ్మె తాత్కాలిక వాయిదా

ABN , First Publish Date - 2023-05-31T23:46:59+05:30 IST

సిద్దిపేట అర్బన్‌, మే 31: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 44 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెచేస్తున్న ఐకేపీ వీవోఏలు బుధవారం నుంచి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఐకేపీ వీవోఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్‌వి.రమ తెలిపారు.

ఐకేపీ వీవోఏల సమ్మె తాత్కాలిక వాయిదా
వీవోఏల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు రమ

మంత్రి దయాకర్‌రావు హామీతో విరమణ

సిద్దిపేట అర్బన్‌, మే 31: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 44 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెచేస్తున్న ఐకేపీ వీవోఏలు బుధవారం నుంచి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఐకేపీ వీవోఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్‌వి.రమ తెలిపారు. బుధవారం సిద్దిపేటలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీమేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సమ్మె విషయంలో మంత్రితో జరిగిన చర్చలలో సానుకూలంగా స్పందించి డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే సమ్మెను విరమించినట్లు తెలిపారు. ఐకేపీ వీవోఏలు కోరినట్లుగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నదని ఆశిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, కార్యదర్శి గోపాలస్వామి, సహాయ కార్యదర్శి రవికుమార్‌, ఐకేపీ వీవోఏల జిల్లా నాయకులు కిష్టయ్య, రాజు, కనకయ్య, భవాని, లత, సుష్మ, లావణ్య, నిఖిత, మంజుల, యమునా, హాలీఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:46:59+05:30 IST