ప్లాస్టిక్‌ను అంతమొందిస్తేనే మానవ మనుగడ
ABN , First Publish Date - 2023-09-04T00:17:44+05:30 IST
మనోహరాబాద్, సెప్టెంబరు 3: ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్‌ను అంతమొందిస్తేనే మానవునికి మనుగడ అని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సినీనటుడు అలీ అన్నారు.
రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సినీనటుడు ఆలీ
మనోహరాబాద్, సెప్టెంబరు 3: ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్‌ను అంతమొందిస్తేనే మానవునికి మనుగడ అని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సినీనటుడు అలీ అన్నారు. సోమవారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని కొండాపూర్ ఐలా పరిశ్రమలో ఏఐసీఎంటీ ప్లాస్టిక్ వన్ టైం యూత్ అనే పరిశ్రమను రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య, డీఆర్డీవో శాస్త్రవేత వీరబ్రహ్మంతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతీ పనికి ఎక్కువగా ప్లాస్టిక్‌ను వాడుతున్నామని, దానిని తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్ వల్ల మానవ మనుగడకు ప్రమాదం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ 200 సంవత్సరాలు అయినా భూమిలో కరగడం లేదని చెప్పారు. ప్లాస్టిక్‌ను రూపుమాపాలంటే జీవ పదార్థాలను ఉపయోగించి ప్లాస్టిక్ బ్యాగులను తయారీ పరిశ్రమను ఏర్పాటుచేసిన మౌలాలి, షేక్ జానీలను అభినందించారు. ఏఐసీఎంటీ పరిశ్రమల్లో తయారైన వస్తువులు 90 రోజుల వ్యవధిలోనే భూమిలో కరిగిపోతాయని డీఆర్డీవో వీరబ్రహ్మం సూచించారు. ప్రతినెలా సినిమా యాడ్ ద్వారా ప్రజలకు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సమాచారమందించాలని, దీనికి తాను సహకారం అందిస్తానని సినీనటుడు అలీని ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. అనంతరం ఆలీ తన తమ్ముడు షేక్ జానీ మాట్లాడుతూ జీవ పదార్థంతో కూడిన ప్లాస్టిక్ భూమిలో తొందరగా కలిసిపోతుందని, దీనివల్ల భూసారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య, పరిశ్రమ యజమానులు షేక్ షరీఫ్, హఫ్రిజ్, హసిన్, కొండాపూర్ సర్పంచ్ మమతారవి, ఉపసర్పంచ్ వెంకటేష్, వార్డుసభ్యులు చింతల బాబు, సత్యనారాయణ, నవీన్, రాము, తదితరలు పాల్గొన్నారు.