ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆరోగ్య పరీక్షలు
ABN , First Publish Date - 2023-09-22T00:48:38+05:30 IST
ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తెలిపారు.

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 21: ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబీకుల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం నిర్ణయించింది. గురువారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ కాశీనాథ్, ఓఎస్డీ బాలరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెప్టెంబరు 23న హుస్నాబాద్ డివిజన్‌లోని కేరళ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఆవరణలో, 24తేదీన సిద్దిపేట డివిజన్‌లోని అంబిటస్ పాఠశాలలో, అదేవిధంగా 28 తేదీన దుబ్బాక డివిజన్ లోని మిరుదొడ్డిలో బ్లూమింగ్‌బర్డ్స్ పాఠశాల ఆవరణలో, 30వ తేదీన చేర్యాల డివిజన్‌లోని వికాస్ గ్రామర్ స్కూల్ ఆవరణలో, అక్టోబరు 1న గజ్వేల్ డివిజన్‌లోని సాయి జీడీఆర్ హైస్కూల్ ఆవరణలో హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్టు తెలిపారు. అవసరమైనవారిని మెగా హెల్త్ క్యాంప్‌కి పిలుస్తారని చెప్పారు. అక్టోబరు 13వ తేదీన సిద్దిపేటలోని మెరీడియన్ పాఠశాల ఆవరణలో జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ట్రస్ట్ మా అధ్యక్షుడు సోమేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి ఎడ్ల శ్రీనివా్‌సరెడ్డి, క్యాషియర్ కుంట రాజు, సిద్దిపేట టౌన్ అధ్యక్షుడు మోహన్ కుమార్, ట్రెజరర్ రవి ఇంకా భాస్కర్ రెడ్డి రవి చిన్న పాల్గొన్నారు.