హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి
ABN , First Publish Date - 2023-02-11T23:18:06+05:30 IST
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలని సమతా సైనికులు, దళ్ నాయకులు డిమాండ్ చేశారు.
కోహీర్/నారాయణఖేడ్/తూప్రాన్/కంగ్టి, ఫిబ్రవరి 11: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలని సమతా సైనికులు, దళ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కోహీర్‌లోని పోలీ్‌సస్టేషన్‌లో సమతా సైనిక నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఖేడ్‌లోని రాజీవ్ చౌక్ వద్ద వివిధ ప్రజా సంఘాల నాయకులు హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంబేడ్కర్ చౌక్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరిమాదిగ ఆధ్వర్యంలో తూప్రాన్ ఎస్‌ఐ సురే్‌షకుమార్‌కు ఫిర్యాదు చేశారు. కంగ్టిలో కేవీపీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంబేడ్కర్ బతికి ఉంటే గాంధీని గాడ్సే కాల్చినట్లే, తాను కూడా అంబేడ్కర్‌ను కాల్చి చంపేవాడినని హమారా ప్రసాద్ బహిరంగంగా ప్రకటించడాన్ని ఉపేక్షించరాదన్నారు. హమారా ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కోహీర్‌లో సమతా సైనిక దళ్ డివిజన్‌ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుల్జరామ్, కోహీర్ మండలాధ్యక్షుడు కిరణ్‌కుమార్, సభ్యులు శ్రీధర్, రవి, విజయ్, నారాయణఖేడ్‌లో బీఎస్పీ, బీంఆర్మీ పార్టీల నియోజకవర్గ అధ్యక్షులు అలిగే జీవన్‌కుమార్, సురేష్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింలు, అంబేడ్కర్ సేన ఖేడ్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, అంబేడ్కర్ ఫౌండేషన్ నిర్వాహకులు సంజీవ్, తూప్రాన్‌లో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరిమాదిగ, తదితరులు పాల్గొన్నారు.