6 పథకాలతో అభివృద్ధి గ్యారెంటీ

ABN , First Publish Date - 2023-09-20T00:24:41+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ 6 గ్యారెంటీ పథకాలపై ఇంటింటా ప్రచారం మొదలుపెట్టింది.

6 పథకాలతో అభివృద్ధి గ్యారెంటీ

అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ 6 గ్యారెంటీ పథకాలపై ఇంటింటా ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం అగ్రనేతలందరూ గ్రామాల బాటపట్టారు. మహిళలకు ప్రతీ నెల రూ.2,500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, రైతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, పంటకు రూ.500 బోనస్‌, ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇళ్లు లేనివారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని వివరిస్తున్నారు. నెలకు రూ.4 వేల పింఛన్‌, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూళ్లు నెలకొల్పుతామని చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఈసారి తమకు అధికారం ఇస్తే తప్పనిసరిగా హామీలను అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు.

సంగారెడ్డి టౌన్‌ : సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, సీడబ్యూసీ సభ్యుడు గురుదీ్‌పసింగ్‌ సప్పల్‌, మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్‌ కాంగ్రెస్‌ 6 గ్యారెంటీ పథకాలపై ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా సీడబ్యూసీ సభ్యుడు గురుదీప్‌ సింగ్‌ సప్పల్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమకు అధికారం అప్పగిస్తే నిరుపేదలకు ఉపయోగపడేలా ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కూన సంతో్‌షకుమార్‌, కసిని రాజు, ఆంజనేయులు, బుచ్చిరాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రేగోడులో..

రేగోడు : రేగోడు మండలంలోని గజవాడ గ్రామంలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాల ఇంటింటి ప్రచారాన్ని సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితులు దామోదర్‌ రాజనర్సింహ, కొప్పుల రాజు ప్రారంభించారు. తెలంగాణ దశ, దిశను మార్చే హామీలను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేసిందని గుర్తుచేశారు. రేగోడు మండలానికి జిల్లాల పునర్విభజనలో అన్యాయం జరిగిందని, సంగారెడ్డి జిల్లాలో ఉంచడమే అన్నివిధాల అనుకూలమని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి డాక్టర్‌ సంజీవరెడ్డి, టీపీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దిగంబరావు, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ సరోజన, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంరావు, సర్పంచ్‌లు సునీల్‌కుమార్‌, నర్సింహులు, చోటుమియా, నాగేందర్‌రావు, శంకరప్పతో పాటు త్రిష దామోదర్‌ పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో..

జహీరాబాద్‌ : కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాల కరపత్రాలను జహీరాబాద్‌ పట్టణంలో బిహార్‌ సీఎల్పీ నేత షకీల్‌అహ్మద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్రమోదీ హయాంలో ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనతంరం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్మాశిఖర్‌ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌, జహీరాబాద్‌ ఎంపీపీ గిరిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నరే్‌షగౌడ్‌, నాయకులు నర్సింహారెడ్డి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌లో..

నారాయణఖేడ్‌ : కాంగ్రెస్‌ ఆరు పథకాలపై నారాయణఖేడ్‌లో మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురే్‌షషెట్కార్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కాంగ్రె్‌సతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని వారు వివరించారు.

నర్సాపూర్‌లో..

నర్సాపూర్‌ : కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాలను సీడబ్ల్యూసీ సభ్యుడు సతేజ్‌-డీ-పాటిల్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆవుల రాజిరెడ్డి, భూపతిరెడ్డి, పీసీసీ సభ్యుడు ఆంజనేయులుగౌడ్‌, రవీందర్‌రెడ్డితో కలిసి నర్సాపూర్‌లో ఆవిష్కరించారు. అనంతరం నర్సాపూర్‌ మండలం సీతారాంపూర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాలపై కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సగుప్తా, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మల్లేశంతో పాటు నాయకులు పాల్గొన్నారు.

చేగుంటలో..

చేగుంట : మండలంలోని వడియారం గ్రామంలో కాంగ్రెస్‌ గ్యారెంటీ పథకాల ప్రచారంలో సీడబ్ల్యూసీ సభ్యుడు మహే్‌షశర్మ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు చేగుంటలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పథకాలతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పెంటారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీమాన్‌రెడ్డి, శ్రీకాంత్‌, రాంరెడ్డి, మాధవరెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:24:41+05:30 IST