గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రింగ్‌రోడ్డు పనులను వేగంగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2023-02-14T23:46:37+05:30 IST
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రింగ్‌రోడ్డు పనులను వేగంగా పూర్తిచేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
గజ్వేల్, ఫిబ్రవరి 14: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రింగ్‌రోడ్డు పనులను వేగంగా పూర్తిచేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రింగ్‌రోడ్డు పనులను ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత సమయంలోపు ఖచ్చితంగా పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులకు, అధికారులకు ఆదేశాలిచ్చారు. పనుల్లో అలసత్వం పనికిరాదని, అవరోధాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నారు. సెంట్రల్ లైటింగ్, కాటిల్‌బోర్డు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని, చౌరస్తా, డివైడర్ మధ్యలో, రింగ్‌రోడ్డకు ఇరువైపులా పెద్దమొక్కలు, పూలమొక్కలు, ఇతర మొక్కలతో గ్రీనరీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ప్లాంటేషన్ పనులను రోజువారీగా పర్యవేక్షణ చేయాలని ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి సూచించారు. ఆర్‌అండ్‌బీ, ఆర్‌ఎస్ కన్‌స్ట్రక్షన్స్ అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా పూర్తిచేయాలన్నారు. ఆయ న వెంట ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుదర్శన్‌రెడ్డి, డీఈఈ బాలాప్రసాద్, రామకృష్ణ, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపల్ చైర్మన్ రాజమౌళి, హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.