ప్రజలను చైతన్య పరిచిన అభ్యుదయ విప్లవ కవి గద్దర్‌

ABN , First Publish Date - 2023-09-08T23:29:50+05:30 IST

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పటాన్‌చెరులో గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

ప్రజలను చైతన్య పరిచిన అభ్యుదయ విప్లవ కవి గద్దర్‌
గద్దర్‌ గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, తదితరులు

పటాన్‌చెరు, సెప్టెంబరు 8: అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని, ప్రజలను చైతన్య పరిచిన అభ్యుదయ విప్లవ కవి గద్దర్‌ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కొనియాడారు. పటాన్‌చెరులో గద్దర్‌ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.30లక్షల స్వంత నిధులతో 11అడుగుల గద్దర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమసమాజ స్థాపన, దోపిడీ రహిత సమాజం కోసం ఆయన కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయడమే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్‌, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, జడ్పీటీసీ సుప్రజవెంకట్‌రెడ్డి, ఎంపీపీ ఈగ సుష్మశ్రీ, ఆత్మకమిటీ చైర్మన్‌ కుమార్‌గౌడ్‌, షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్రారం శంకర్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రుద్రారం పాండు, మాజీ కార్పొరేటర్‌ అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-09-08T23:29:56+05:30 IST