పాటలతో చైతన్యం తెచ్చిన గొప్ప గాయకుడు గద్దర్‌

ABN , First Publish Date - 2023-09-23T00:12:41+05:30 IST

తన పాటల ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చి తనకంటు ప్రత్యేక స్థానం పొందిన గొప్ప ప్రజాగాయకుడు గద్దర్‌ అని ప్రొఫెసర్‌ కొదండరాం కొనియాడారు.

పాటలతో చైతన్యం తెచ్చిన గొప్ప గాయకుడు గద్దర్‌
సభలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

సంస్మరణ సభలో ప్రొఫెసర్‌ కోదండరాం

నర్సాపూర్‌, సెప్టెంబరు 22: తన పాటల ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చి తనకంటు ప్రత్యేక స్థానం పొందిన గొప్ప ప్రజాగాయకుడు గద్దర్‌ అని ప్రొఫెసర్‌ కొదండరాం కొనియాడారు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లో జెజ్జనక కళాబృందం ఆధ్వర్యంలో గద్దర్‌ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదండరాంతో పాటు గద్దర్‌ కూతురు వెన్నెల హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నా వారికి అండగా నిలిచి వారికి న్యాయం జరిగే వరకు పోరాడిన వ్యక్తి గద్దర్‌ అని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం తనదైన శైలిలో పోరాడిన ప్రజాగాయకుడు అని కొనియాడారు. గద్దర్‌ తన పాటల రూపంలో ఎందరినో మార్చడమే కాకుండా ఇప్పుడు ఇంతమంది ప్రజాగాయకులుగా ఉన్నారంటే అదంతా ఆయనే కారణమన్నారు. గద్దర్‌ కూతురు వెన్నెల మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన వ్యక్తి అని తెలిపారు. గద్దర్‌ ఓ జ్ణానవంతుడు, నిశబ్ద విప్లవమన్నారు. కార్యక్రమంలో శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, గాయకుడు యాదగిరి, కళాబృందం ప్రతినిధులు అల్లీపూర్‌రమేష్‌, మైసయ్య, కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:12:41+05:30 IST