Share News

ఆరు గ్యారంటీల అమలుకే

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:22 AM

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.

ఆరు గ్యారంటీల అమలుకే

ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల స్వీకరణ

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

సంగారెడ్డిరూరల్‌, డిసెంబరు 28 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతకుముందు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం వద్దకు ప్రజలు వచ్చేవారని.. కానీ తమ ప్రభుత్వం ప్రజల వద్దకే వస్తుందని పేర్కొన్నారు. పదేళ్ల తరువాత కాంగ్రె్‌సకు ప్రజలు అవకాశం ఇచ్చారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ప్రజలకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు దరఖాస్తులు ఎలా పూర్తి చేయాలనే విషయమై అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సంగారెడ్డిలో ప్రజాపాలనను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్‌, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మిరవి, మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, అధికారులు పాల్గొన్నారు.

ప్రజల వద్దకే ప్రభుత్వం

జోగిపేట/పుల్‌కల్‌, డిసెంబరు 28: ప్రజల సమస్యలు, అవసరాలు తెలుసుకునేందుకే ప్రభుత్వం ‘ప్రజాపాలన’ పేరిట ప్రజల వద్దకు వస్తున్నదని వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. అందోలు మండలంలోని సంగుపేట, చౌటకూర్‌ మండలం శివంపేటలో ఆయన ‘ప్రజాపాలన’ దరఖాస్తు స్వీకరణను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ పేరిట అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి నిరాటకంగా అమలు చేశామని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుతం ఇందిరమ్మ పేరిట ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రూ. 10 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ, రైతుభరోసా, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌, చేయూత పెన్షన్‌ తదితర పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బాసటగా నిలిచి సంక్షేమ ఫలాలను పొందాలని కోరారు. ప్రజల నుంచి దరఖాస్తులన్నింటినీ స్వీకరించి వారిలో అర్హులైన వారిని గుర్తించి సంక్షేమ ఫలాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజుశ్రీజైపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శరత్‌, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో పాండు, అందోలు ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్‌ ఆంటోనీ, నాయబ్‌ తహసీల్దార్‌ మధుకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అద్యక్షుడు శివరాజ్‌యాదవ్‌, నాయకులు రాజిరెడ్డి, శంకర్‌గౌడ్‌, రవీందర్‌ గౌడ్‌, పుల్కల్‌ ఎంపీపీ పట్లోళ్ల చైతన్యవిజయభాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు దుర్గారెడ్డి, నత్తి దశరత్‌, సర్పంచ్‌లు పట్లోళ్ల రాజిరెడ్డి, పల్లవిజయరాంరెడ్డి, ఎంపీటీసీ కిరణ్‌గౌడ్‌, నాయకులు లక్ష్మారెడ్డి, గోవర్ధన్‌, కృష్ణ, మోహన్‌రెడ్డి, ఈశ్వర్‌గౌడ్‌, శ్రీనివా్‌సరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మల్లిఖార్జున్‌గౌడ్‌, యాదయ్య పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

అల్లాదుర్గం/టేక్మాల్‌/రేగోడు, డిసెంబరు 28: ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేరుస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ఆయన అల్లాదుర్గం మండలం రాంపూర్‌, టేక్మాల్‌ మండలం చల్లపల్లి, రేగోడు మండలం టి.లింగంపల్లి గ్రామాల్లో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10లక్షల వరకు పెంచడం చేశామని చెప్పారు. మిగతా హామీలను నెరవేర్చడానికే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. అల్లాదుర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అల్లాదుర్గం మండలంలో ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌, డీపీవో సాయిబాబా, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, ఎంపీడీవో శంకర్‌యాదవ్‌, తహసీల్దార్‌, టేక్మాల్‌లో జడ్పీటీసీ సరోజ, వైస్‌ ఎంపీపీ మంజుల, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నిమ్మరమేష్‌, రేగోడులో డీఎంహెచ్‌వో చందునాయక్‌, మాజీ ఎంపీపీ సురేష్‌ షెట్కార్‌, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ సరోజన, తహసీల్దార్‌ బాలలక్ష్మి, ఎంపీడీవో సీతారావమ్మ, వైద్యాధికారి శ్వేత, సిద్దప్ప, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దిగంబర్‌రావు, టీపీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్‌, శ్రీశైలం, అక్బర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:22 AM