ప్రతిపక్ష నేతలపై కాదు.. అభివృద్ధిపై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2023-10-07T23:31:03+05:30 IST
ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేతల హితవు హుస్నాబాద్‌లో మోదీ దిష్టిబొమ్మ దహనం
హుస్నాబాద్, అక్టోబరు 7: ప్రతిపక్ష నేతలపై కాకుండా దేశాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. ఐటీ సెల్ అనే సంస్థలో రాహుల్‌గాంధీని రావణాసురిడిగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ శనివారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటాన్ని రాక్షసునిగా తయారు చేసి దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి దేశంలోని ప్రతిపక్ష నేతలపై ఉన్న ఆలోచన దేశ అభివృద్ధిపై పెట్టాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో మత విద్వేషాలకు తావిచ్చే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ అధ్యక్షుడు బంక చందు, నాయకులు జంగపల్లి అయిలయ్య, వల్లపు రాజు, మైదంశెట్టి వీరన్న, రజిత, బురుగు కిష్టస్వామి, వెన్న రాజు, ప్రశాంత్, రాజ్‌కుమార్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.