మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి

ABN , First Publish Date - 2023-03-25T23:29:45+05:30 IST

బీజేపీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ, చుక్క రాములు హితవు మెదక్‌కు చేరిన జన చైతన్య యాత్ర

మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి
మెదక్‌లో మాట్లాడుతున్న జాన్‌ వెస్లీ

మెదక్‌/రామాయంపేట/హత్నూర, మార్చి 25: బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జాన్‌వెస్లీ, చుక్క రాములు, సాగర్‌ హితవు పలికారు. సీపీఐఎం చేపట్టిన జన చైతన్య బస్సు యాత్ర శనివారం మెదక్‌, రామాయంపేట, హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్‌లో కొనసాగింది. ఆయా పట్టణాల్లో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు లక్షల కోట్లు కట్ట పెడుతూ ప్రజలపై భారం మోపుతందన్నారు. దేశంలో 23 కోట్ల మందిని పేదలుగా మార్చారని మండిపడ్డారు. దేశం అంటే అంబానీ, అదానీల సొత్తుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను పెంచుతూ సామాన్యులపై భారం మోపారని మండిపడ్డారు. ప్రధాని మోదీ పేదలను అబద్ధపు వాగ్ధానాలతో నమ్మిస్తూ ప్రపంచ ఆకలి సూచిలో దేశాన్ని పూర్తిగా దిగజార్చారని మండిపడ్డారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గాలికొదిలేశారన్నారు. మోదీ విధానాలతో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. వీటన్నింటిని ఎదుర్కొనేందుకు సీపీఎం జన చైతన్య యాత్రల పేరుతో దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి పూనుకుందన్నారు. మెదక్‌ పట్టణంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశం అధ్యక్షతన నిర్వహించిన సభకు రాష్ట్ర కమీటీ సభ్యులు మల్లిఖార్జున్‌, రమణ, ధర్మ, జిల్లా కార్యదర్శి బాలమణి, కార్యదర్శిర్గ సభ్యులు నర్సమ్మ, మల్లేశం, మహేందర్‌రెడ్డి, బస్వరాజ్‌, కమిటీ సభ్యులు నాగరాజు, మల్లేశం, బాగయ్య, నాగేందర్‌, సంతోష్‌, గీత, నాయకులు సర్ధార్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఖలెక్‌ హాజరయ్యారు. దౌల్తాబాద్‌లో యాత్రకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రమా వెంకట్‌, రాములు, మెదక్‌ జిల్లా కార్యదర్శి మల్లేశం, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్‌, యాదవరెడ్డి, మహిపాల్‌, శేఖర్‌, షబ్బీర్‌, జడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ వావిలాల నర్సింలు, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, హత్నూర ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌ దుర్గారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ బుచ్చిరెడ్డి, ఎంపీటీసీలు కిషన్‌రావు, విఠల్‌రెడ్డి, మండల యూత్‌ అధ్యక్షుడు కిషోర్‌ ఆలీ, సతీష్‌, కృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:29:45+05:30 IST