ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి: ఆకుల రజిత

ABN , First Publish Date - 2023-01-25T23:35:57+05:30 IST

హుస్నాబాద్‌టౌన్‌, జనవరి 25: ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి: ఆకుల రజిత
కంటి పరీక్షలను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ రజిత

హుస్నాబాద్‌టౌన్‌, జనవరి 25: ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత పిలుపునిచ్చారు. బుధవారం ఆమె హుస్నాబాద్‌ పట్టణంలోని 2వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, కౌన్సిలర్లు బోజు రమాదేవి, రవీందర్‌, అయిలేని శంకర్‌రెడ్డి, అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:35:57+05:30 IST