రేపటి నుంచి ‘ఐఐటీహెచ్’లో ఎలాన్ ఎన్‌విజన్ ఫెస్ట్
ABN , First Publish Date - 2023-02-16T00:27:57+05:30 IST
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో ఈనెల 17 నుంచి 19 వరకు ఎలాన్ ఎన్‌విజన్ సాంస్కృతిక, సాంకేతిక వేడుకలు జరగనున్నాయి.
దేశ నలుమూలల నుంచి రానున్న 50 వేల మంది విద్యార్థులు
కంది,ఫిబ్రవరి 15: సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో ఈనెల 17 నుంచి 19 వరకు ఎలాన్ ఎన్‌విజన్ సాంస్కృతిక, సాంకేతిక వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి ఆఫ్‌లైన్ మోడ్‌లో సాంస్కృతిక వేడుకలు కోలాహోలంగా జరగనున్నాయని ఐఐటీహెచ్ అధికారులు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సీక్రేట్ ఆఫ్ వాలెన్రో థీమ్‌తో పాటు ది కలెక్టివ్ అనే భారతీయ ఇండీ బ్యాండ్ ద్వారా మొదలు కానున్నాయి. ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్‌గా గ్రీన్ కో సంస్థ వ్యవహరించనున్నది. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత గాయకుడు గజేంద్రవర్మ తన గాత్రంతో, కామిక్‌స్టాన్ సీజన్-3 విజేత ఆశీష్ సోలంకి కామెడీతో, డీజే షాన్ రీమిక్స్‌తో విద్యార్థులను అలరించనున్నారు. ఈసారి కూడా ఐఐటీహెచ్ విద్యార్థులతో పాటు, దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కళశాలల నుంచి 50వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. కార్యక్రమాల్లో భాగంగా ప్రోక్విస్ట్, ఎగ్మా, ఆఫ్ డెవల్‌పమెంట్, వెబ్ డెవల్‌పమెంట్, షార్క్‌ట్యాంక్, సర్క్యూట్ బిల్డింగ్, కోడ్ ఆర్డినో, మచీనా డాక్టొరియా, డీఎ్‌ఫఎన్, క్యాడ్ ప్రో, హ్యాకథాన్, పెపర్ ప్రజెంటేషన్, గేమ్ జామ్, బీట్ టిప్పర్, బ్రేక్‌ఫ్రీ, క్యాంపస్ ఐడల్, ఫిల్మ్‌ఫేర్ ఫెస్టా, గ్లిట్జ్ గ్లామర్, పెయింట్ ద స్ర్కీన్, స్టాండ్ అప్ కామెడీ, ఆర్ట్ ఎటాక్, నృత్యాంజలి, డుడ్లే క్రియేషన్, పైస్లేటిక్ తదితర అంశాల్లో పోటీలుంటాయి. విజేతలకు రూ.7లక్షల విలువైన బహుమతులను అందజేయనున్నట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి వెల్లడించారు.