గ్రామాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
ABN , First Publish Date - 2023-09-23T00:14:28+05:30 IST
గ్రామాల అభివృద్ధి బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమవుతుందని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ పేర్కొన్నారు.
చిన్నకోడూరు, సెప్టెంబరు 22 : గ్రామాల అభివృద్ధి బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమవుతుందని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ విజయలక్ష్మితో కలిసి ఆమె సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మండలాధ్యక్షుడు శ్రీనివాస్, పీఏసీఏస్ చైర్మన్ కనకరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు ఉమేష్‌చంద్ర, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ శంకర్, బీఆర్‌ఎస్ నాయకుడు వినయ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.