గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-03-30T23:45:18+05:30 IST

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యం: ఎమ్మెల్యే
కామారం గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పద్మారెడ్డి

చిన్నశంకరంపేట, మార్చి 30: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని కామారం గ్రామంలో సర్పంచ్‌ పూలపల్లి యాదగిరియాదవ్‌ ఆధ్వర్యంలో మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. ముదిరాజ్‌ సంఘం భవన నిర్మాణ పనులు, మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి స్మృతి భవన నిర్మాణ పనులకు శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతూ నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్య్రమంలో జడ్పీటీసీ మాధవిరాజు, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజు, రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచులు యాదగిరియాదవ్‌, దయానంద్‌, శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీలు రాధికకుమార్‌గౌడ్‌, యాదగిరి, సక్కుబాయి, సొసైటీ చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, పీఆర్‌ఏఈ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులపై ఎమ్మెల్యే ఆగ్రహం

హవేళిఘనపూర్‌: హవేళిఘనపూర్‌లో గురువారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు. హవేళిఘనపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపటడ్డంతో క్రీడలు ఆడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామ యువకులు ఎమ్మెల్యేకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే పాఠశాల మైదానానికి చేరుకొని నిర్మాణాలను పరిశీలించి స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా చేపడుతారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని యువకులకు హమీ ఇచ్చారు. ఆమెవెంట బీఆర్‌ఎస్‌ నాయకులు రామచంద్రారెడ్డి, సాయిలు, నాగరాజు, శ్రీకాంత్‌ ఉన్నారు.

Updated Date - 2023-03-30T23:45:40+05:30 IST