బీజేపీ హయాంలో అన్నిరంగాల్లో అభివృద్ధి
ABN , First Publish Date - 2023-06-26T00:32:24+05:30 IST
బీజేపీ హయాంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ పాలనతో దేశం సుభిక్షం
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా
హవేళిఘనపూర్/పాపన్నపేట/మెదక్, జూన్ 25 : బీజేపీ హయాంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో పర్యటించి సందర్భంగా ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం ఆయన మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంను సందర్శించారు. అనంతరం ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్నారు. అనంతరం మండల కేంద్రమైన హవేళీఘనపూర్‌లో మహాజన సంపర్క్ అభియాన్ యోజనలో భాగంగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నియోజకవర్గ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం శాంతిభద్రతలు, సుఖశాంతులతో సుభిక్షంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ భూటకపు హామీలతో అన్నివర్గాల వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర రైతులకు రుణమాఫీ, పంట నష్టపరిహారం ఇవ్వలేదని, నిరుద్యోగులకు భృతిపై మాట తప్పిందని మండిపడ్డారు.
స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తా
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు తరలించిన అథ్లెటిక్ కోచింగ్ సెంటర్‌ను మళ్లీ మెదక్ స్టేడియంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంను సందర్శించిన పురుషోత్తం రూపాలాకు ఫిజికల్ డైరెక్టర్లు, మెదక్ జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ నేతలు, సిటిజన్ ఫోరం నాయకులు, అథ్లెట్లు వినతిపత్రం సమర్పించారు. వెనుకబడిన ప్రాంతమైన మెదక్‌లో అప్పటి ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీని ఏర్పాటు చేసిందని, బాక్సింగ్ అకాడమీ కొనసాగేదని, వీటిని హైదరాబాద్‌కు తరలించారని వివరించారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ సంబంధిత మంత్రికి తెలియజేసి అకాడమీని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
దుర్గామాత సన్నిధిలో కేంద్ర మంత్రి పూజలు
ఏడుపాయల వనదుర్గాభవాని మాతను కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా దర్శించుకున్నారు. వారికి ఆయల ఈవో శ్రీనివాస్, అర్చక బృందం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ ఈవో శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనార్దన్‌రెడ్డి, రాజశేఖర్, పరిణిత, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్, సుధాకర్‌రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు రామ్‌చరణ్‌యాదవ్, జిల్లా నాయకులు ఎంఎల్‌ఎన్‌రెడ్డి, శ్రీపాల్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, హవేళీఘనపురం మండల అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఉపేందర్, బూత్ అధ్యక్షుడు రాంచందర్, ఏకొండ, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, ఆర్డీవో సాయిరాం, శాయ్ డీడీ శరత్‌చంద్రయాదవ్, మత్స్యశాఖ డీడీ రజని, విజయ డైరీ డీడీ శ్రీనివాస్, స్పోర్ట్స్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు జుబేర్, ఎంఎల్‌ఎన్‌రెడ్డి, నందిని శ్రీను, కొండ శ్రీను, సత్యలం శ్రీను, సిటిజన్ ఫోరం కార్యదర్శులు కొండల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు మధుసూదన్, ప్రసాద్, విజయ్, పాపన్నపేట మండల నాయకులు సంతో్‌షచారి, సత్యనారాయణ, మెదక్ ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు, ఎస్‌ఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.