ఐవోసీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-08-02T23:43:18+05:30 IST

హుస్నాబాద్‌లో నిర్మాణంలో ఉన్న సమీకృత కార్యాలయ భవన నిర్మాణం(ఐవోసీ) పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను, కాంట్రాక్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు.

ఐవోసీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
హుస్నాబాద్‌ మోడల్‌ స్కూల్‌లో అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌

హుస్నాబాద్‌, దుబ్బాక మండలాల్లో ఎన్నికల స్ట్రాంగ్‌రూం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌

హుస్నాబాద్‌రూరల్‌, ఆగస్టు 2: హుస్నాబాద్‌లో నిర్మాణంలో ఉన్న సమీకృత కార్యాలయ భవన నిర్మాణం(ఐవోసీ) పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను, కాంట్రాక్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. బుధవారం హుస్నాబాద్‌ మండలం గాంధీనగర్‌, కిషన్‌నగర్‌లో నిర్మాణం అవుతున్న ఐవోసీ భవనాన్ని, మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల స్ర్టాంగ్‌రూంను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మోడల్‌ స్కూల్‌ నుంచి మెయిన్‌ రోడ్డు వరకు మెటల్‌రోడ్‌ వేయాలని మున్సిపల్‌ అధికారులను, స్కూల్‌ నుంచి ప్రతీ స్తంభానికి స్ట్రీట్‌ లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత ఏఈలను ఆదేశించారు. మోడల్‌ స్కూల్‌ ఆవరణలో తగినన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్డీవో, పోలీస్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో బెన్‌షాలోమ్‌, ఏసీపీ సతీ్‌షకుమార్‌, సీఐ ఎర్రల కిరణ్‌, మున్సిపల్‌ అధికారులు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌ తదితరులు ఉన్నారు.

దుబ్బాకలో అదనపు కలెక్టర్‌ పరిశీలన

దుబ్బాక, ఆగస్టు 2: ఎన్నికల నిర్వహణ కోసం దుబ్బాకలోని సీఎం కేసీఆర్‌ స్కూల్‌లోని స్ర్టాంగ్‌ రూంను బుధవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ పరీశీలించారు. అలాగే దుబ్బాకలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం దుబ్బాకలోని రెవెన్యూ కార్యాలయంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లకు, ఎంపీడీవోలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆమె వెంట తహసీల్దార్‌ సలీం, ఎంపీడీవో రాజిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గణే్‌షరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-02T23:43:18+05:30 IST