పేదల కోసం కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల నిర్మాణం

ABN , First Publish Date - 2023-05-26T23:31:45+05:30 IST

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మీర్జాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పేదల కోసం కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల నిర్మాణం
మీర్జాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

హుస్నాబాద్‌రూరల్‌, మే 26: గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వాసుపత్రులను నిర్మిస్తున్నట్లు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌ మండలం మీర్జాపూర్‌లో రూ.2 కోట్లతో నిర్మాణం చేపట్టే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేసి, మెరుగైన సౌకర్యాలతో ప్రారంభించేందుకు కృషిచేస్తానన్నారు. అన్ని రంగాల ప్రజల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనతి కాలంలోనే మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, గోదావరి జలాలు పారిస్తున్న సీఎం కేసీఆర్‌ ఒక్కడేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లకావత్‌ మానస, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, డాక్టర్‌ సౌమ్య, నిఖిత, సర్పంచ్‌లు తరాల లత, మహేందర్‌, విజయలక్ష్మి, రజిత, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, రమణారెడ్డి, పొన్నబోయిన శ్రీనివాస్‌, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T23:31:45+05:30 IST