పోస్టల్‌ ఆఫీస్‌ తరలింపుపై కాంగ్రెస్‌ ఆందోళన

ABN , First Publish Date - 2023-09-22T23:32:25+05:30 IST

మెదక్‌, సెప్టెంబరు 22: మెదక్‌ నుంచి మరో కార్యాలయం తరలింపునకు రంగం సిద్ధమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హెడ్‌ పోస్టాఫీస్‌ ముందు ఆంఓళన చేపట్టారు.

పోస్టల్‌ ఆఫీస్‌ తరలింపుపై కాంగ్రెస్‌ ఆందోళన
మెదక్‌లోని హెడ్‌ పోస్టాఫీస్‌ ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మెదక్‌, సెప్టెంబరు 22: మెదక్‌ నుంచి మరో కార్యాలయం తరలింపునకు రంగం సిద్ధమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హెడ్‌ పోస్టాఫీస్‌ ముందు ఆంఓళన చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ నేతలు సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ మాట్లాడుతూ మెదక్‌ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రధాన కార్యాలయాలు సిద్దిపేటకు తరలిపోయాయని, తాజాగా మెదక్‌లోని హెడ్‌ పోస్టాఫీస్‌ కూడా తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ మెదక్‌లో పోస్టల్‌ డివిజన్‌ కార్యాలయాన్ని మంజూరు చేసి అద్భుతమైన భవనాన్ని నిర్మింపజేశారని తెలిపారు. అలాంటి కార్యాలయాన్ని నేడు తరలించేందుకు మంత్రి హరీశ్‌రావు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులతో నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం పోస్టల్‌ డివిజనల్‌ మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోవర్దన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రమే్‌షరెడ్డి, హఫీజ్‌, మొల్సాబ్‌, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌, ఎంపీటీసీలు శివకుమార్‌, ప్రసాద్‌గౌడ్‌, శ్రీహరి, నాయకులు పంతులు భూమన్న, డాకీ స్వామి, భరత్‌గౌడ్‌, అనుదీప్‌, శాంతప్ప, నవీన్‌చౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:32:25+05:30 IST