పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
ABN , First Publish Date - 2023-09-19T23:55:19+05:30 IST
మెదక్ అర్బన్, సెప్టెంబరు 19: తప్పులు లేని ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ఎలకో్ట్రరల్ అబ్జర్వర్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు అధికారులకు సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి
ఎలక్ర్టోరల్ పరిశీలకులు డా. క్రిస్టినా జెడ్ చోంగ్తు
కలెక్టర్‌తో కలిసి పోలింగ్ కేంద్రాల సందర్శన
మెదక్ అర్బన్, సెప్టెంబరు 19: తప్పులు లేని ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ఎలకో్ట్రరల్ అబ్జర్వర్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లాలోని మెదక్ అసెంబ్లీ పరిధిలోని దాయర, నర్సాపూర్ సెగ్మెంట్‌లోని రెడ్డిపల్లి పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షిషాతో కలిసి సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఎస్‌ఎ్‌సఆర్-2 స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, జెండర్ రేషియా, పీడబ్య్లూడీ ఓటరు నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఇప్పటివరకు ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే ఆన్‌లైన్ చేయాలన్నారు. జాబితా రూపకల్పనలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారం తీసుకొని తప్పులు లేని జాబితాను రూపొందించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ప్రత్యేక శిబిరాల ద్వారా నూతన ఓటరు నమోదు కోసం ఫారం-6 ద్వారా వచ్చిన దరఖాస్తులు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలనను వెంటనే పూర్తిచేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, బీఎల్‌వోలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.